Indian army found yati in himalayas

#Yati
యతి గురించి మరో సారి తీవ్ర చర్చ జరిగింది. సోషల్ మీడియాలోనూ, వార్తల్లోనూ నిన్నటి నుండి యతి గురించి చెప్పుకుంటూ వచ్చారు. అందుకు కారణం యతిని చూశామని చెప్పడమే..! మంచుకొండల్లో సాహసయాత్రకు వెళ్లిన భారత సైనికుల బృందానికి మంచు మనిషి
పాదముద్రలు కనిపించడంతో వారు ఫోటోలు తీశారు. ఏప్రిల్ 9వ తేదీన మకలు బేస్ క్యాంప్ ప్రాంతానికి వెళ్లిన సైనిక బృందం, అక్కడే ఈ పాదముద్రలను చూసింది. దాదాపు 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పుతో పాదముద్రలు ఉన్నాయని ఈ సాహసబృందం ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.  పురాణాల్లోనూ యతి ప్రస్తావన ఉండడం.. పలుమార్లు వీటి ప్రస్తావన కూడా రావడంతో.. భారత ఆర్మీ చెప్పింది కూడా నిజమని చాలామంది నమ్మారు.

డెహ్రాడూన్‌‌లోని వైల్డ్‌లైప్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన చెందిన ప్రముఖ శాస్త్రవేత్త బివాష్ పాండవ్ ఈ ఫోటోలపై స్పందించారు. హిమాలయాల్లో యతి వంటి జీవి ఉందన్న వార్తలను తాను నమ్మబోనన్నారు. ఆర్మీకి కనిపించిన పాముద్రలు బహుశా బ్రౌన్ బేర్‌వి అయి ఉండొచ్చన్నారు. ఇక నేపాల్‌లోని వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్)కు చెందిన సంతోష్ మణి కూడా స్పందిస్తూ ఇక్కడి స్థానికులు బ్రౌన్ బేర్‌ను యతిగా వ్యవహరిస్తుంటారని.. వాటి అడుగులేనని అన్నారు.

ఈ ఫోటోలను చూసిన చాలా మంది బ్రౌన్ బేర్ అడుగులు అసలు కాదని వాదిస్తూ ఉన్నారు. ఒక్కో దేశంలో యతిని ఒక్కో పేరుతో పిలుస్తారు. ప్రపంచదేశాలలో కూడా వీటి గురించి ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది.

Comments

  1. Syedraza 7036826613callme whatsapp jobs hyd youaddress com




    Syedraza 7036826613callme whatsapp jobs hyd youaddress com


    ReplyDelete
  2. Syed ayaz 9963490960 callme good hyd youaddress com

    ReplyDelete

Post a Comment

Popular Posts