#ModiNATIONAL ఈ తాత్కాలిక బడ్జెట్ కేవలం ట్రైలరే.. ఎన్నికల తర్వాత అసలైన సినిమా ఉంటుందన్న మోడీ
ప్రజలు ఎంతగానో ఎదురుచూసిన బడ్జెట్ ఈరోజు మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దేశంలోని సగం మంది ప్రజలకు, ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలకు ఏదో ఒక లాభం కలిగేలా మధ్యంతర బడ్జెట్ ఉంది. వ్యవసాయానికి రూ. 6 వేల పంట పెట్టుబడి సాయంతో దాదాపు 12 కోట్ల మంది రైతులకు లాభం కలగనుంది. మహిళలకు 8 కోట్ల ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లను కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో 8 కోట్ల కుటుంబాలు లాభపడతాయి. అసంఘటిత కార్మికులకు పెన్షన్ ను రూ. 3 వేలకు పెంచడంతో సుమారు 10 కోట్ల మంది వరకూ లబ్దిని పొందనున్నారు. మధ్య తరగతి ఉద్యోగుల్లో పన్ను చెల్లిస్తున్న వారికి భారీ ఊరటను ఇస్తూ, పన్ను పరిమితిని రూ. 2.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంతో మొత్తం మీద 33 కోట్ల మందికి ప్రత్యక్షంగా లబ్ది కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాత్కాలిక బడ్జెట్‌పై ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్ర మోడీ. అభివృద్ధి పథంలో నడిపించే బడ్జెట్ ఇది అని, దేశాన్ని బలోపేతం చేసేందుకు ఈ బడ్జెట్ ముందడుగు అని అన్నారు. అన్ని వర్గాల్లో సంతృప్తినిచ్చిన, వ్యవసాయ రంగంతో పాటు రైతులను పరిపుష్టం చేసే బడ్జెట్ ఇది అని చెప్పారు. ఆదాయపన్ను రూ.5 లక్షలకు పెంచాలన్నది ఎన్నో ఏళ్లుగా ఉన్న ప్రజల కోరిక అని, ఆ కోరికను తమ ప్రభుత్వం నెరవేర్చబోతోందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ తాత్కాలిక బడ్జెట్ కేవలం ట్రైలరే అని, ఎన్నికల తర్వాత ఇండియా కొత్త అభివృద్ధి పుంతలు తొక్కించే దిశగా ఇది తీసుకెళ్తుందని ఆయన అన్నారు. దేశ అభివృద్ధికి పన్ను చెల్లిస్తున్న సామాన్యులే కారణమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. మధ్య, ఉన్నత తరగతి వర్గాలు నిజాయతీతో పన్నులు చెల్లించడం వల్లే కొత్త పథకాలు ప్రవేశపెట్టగలిగామని, పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని మోడీ చెప్పుకొచ్చారు.

Comments
Post a Comment